నేడు హనుమకొండలో పలు ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం: డి ఈ సాంబారెడ్డి

నేడు హనుమకొండలో పలు ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం: డి ఈ సాంబారెడ్డి
జ్ఞాన తెలంగాణ హనుమకొండ
హనుమకొండ నగరంలో పలు ప్రాంతాలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు హనుమకొండ టౌన్ డి ఈ జి.సాంబరెడ్డి తెలిపారు. హంటర్ రోడ్ లోని న్యూ శాంపేటలో విద్యుత్ మరమ్మతుల కారణంగా నంది హిల్స్,శ్రీరామ కాలనీ, దీన్ దయాల్ నగర్,హంటర్ హిల్స్ మహాత్మ జ్యోతిరావు పూలే నగర్, ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. నేడు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.