పసిపిల్లల ప్రాణాలు తీసిన పోలియో చుక్కలు

- పోలియో చుక్కలు వేసిన 20 నిమిషాలకే మూడు నెలల చిన్నారి మృతి
జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి అక్టోబర్ 12 :
కంగ్టి మండలంలో భీమ్రా గ్రామంలో ఈరోజు పోలియో చుక్కలు వేసిన 20 నిమిషాలకే మూడు నెలల చిన్నారి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలియో చుక్కలు వేసుకున్న బిడ్డలకు ఏం జరుగుతుందో అన్న అనుమానంతో హాస్పిటల్కు క్యూ కట్టారు, చాలామంది పసిబిడ్డలకు వాంతులు విరేచనాలు అవుతున్నాయి అని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీఎస్పీ పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని చనిపోయిన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు రోడ్డుపై భేటాయించి, బాధితులకు న్యాయం చేయాలని ఈ సంఘటనకు కారణమైనటువంటి గవర్నమెంట్ సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించి వారి పైన కేసు బుక్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
