పోలీస్ అబ్జర్వర్ గా కాలు రావత్ నియామకం:

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట, ఏప్రిల్ 29:
అతి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా పోలీస్ అబ్జర్వర్ డిఐజి కాలు రామ్ రావత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లాకి విచ్చేసిన ఆయనను ఎస్పీ యోగేష్ గౌతమ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. పోలీస్ అధికారుల వివరాలు, భద్రతపరమైన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. ఎలక్షన్స్ దిశగా కేంద్ర బలగాలు పోలిసులు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఓటు విలువ చాలా విలువైనదని సక్రమంగా సరిఅయిన నాయకులను ఎన్నుకోమన్నారు.డిఎస్పీ లింగయ్య పలు పోలీసు అధికారులు పాల్గొన్నారు