ముమ్మరంగా వాహన తనిఖీలు చేసిన పోలీసులు

ముమ్మరంగా వాహన తనిఖీలు చేసిన పోలీసులు


జ్ఞాన తెలంగాణ, టేకుమట్ల:


భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామ శివారులో పోలీసులు ఎస్‌ఐ గోగికారి ప్రసాద్ ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐ ప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంటరీ ఎలక్షన్ సందర్భంగా ప్రయాణికులు 50వేల నగదుకు పైన తీసుకువెళ్లినట్లయితే సంబంధిత ఆధారాలు తమ వెంట తీసుకొని వెళ్లాలని, వాహన పత్రాలను కలిగి ఉండాలని, మద్యం తాగి వాహనాలను నడపరాదని తెలియజేశారు

. ఈ విషయాల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చట్టరీత్యా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ చంద్రశేఖర్, మహేందర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »