ఎన్డీయే కూటమి 3.0 ప్రధాని మోడీజీనే: కొండా కాంగ్రెస్, యూపీఏ పీఎం అభ్యర్థి ఎవరూ?

ఎన్డీయే కూటమి 3.0 ప్రధాని మోడీజీనే: కొండా కాంగ్రెస్, యూపీఏ పీఎం అభ్యర్థి ఎవరూ?
అందెలసరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లలో బీజేపీ బైక్ ర్యాలీలుజ్ఞాన తెలంగాణ, (సరూర్నగర్/ ఆర్కేపురం)దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీకే 3.0 ప్రభుత్వంలో పట్టం కట్టేందుకు సిద్దమైయ్యారని చేవేళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లలో కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి అంజన్, రాధా ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూపీలో గెలిచే సత్తా లేక వాయనాడ్ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం అందెల శ్రీరాములు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీజీ లాగే అవినీతి మచ్చ లేని నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. దశాబ్దాలుగా రంగారెడ్డి జిల్లాకు కేవీఆర్ ఫ్యామిలీ సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నాయకులు పిట్ట ఉపేందర్ రెడ్డి, ఆరుట్ల సురేష్, మదన్ మోహన్ గుప్తా, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బాణాల ప్రవీణ్, డివిజన్ అధ్యక్షులు సిద్దూ ముదిరాజ్, ముంత రాములు, సుదర్శన్, వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, వెంకటేష్ యాదవ్, రంజిత్, కిరణ్ రాజ్, కట్టేల శివ, సురేష్ ముదిరాజ్, జంగయ్య, కరుణ, సుమ సహా బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా సహా అన్ని మోర్చాల నాయకులు పాల్గొన్నారు.
