దివ్యాంగుల ఉపాధి అవకాశాలు కోసం పీఎం-దక్ష్ పోర్టల్

Source| Sakshi Education
దిల్లీ: దివ్యాంగులు శిక్షణ పొందేందుకు, తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొనేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకొనేందుకు సోమవారం కేంద్రం పీఎం-దక్ష్ పోర్టల్‌ను ప్రారంభించింది.
లక్షలాది యువతీ,యువకులు అంగ వైకల్యం వారి జీవనోపాధికి అడ్డంకి గా మారకూడదని వారికి ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా వారి జీవితాలకు భరోసా ఇవ్వడమే ద్యేయంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ పాల్గొన్నారు. దీపావళి కల్లా ఈ పోర్టల్ ద్వారా దివ్యాంగులకు 25 వేల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.