రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి
రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి
జ్ఞాన తెలంగాణ ,నారాయణపేట:

నారాయణపేట జిల్లా లోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘ఎన్నికలు యువత పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠి లో విద్యార్థులు విద్యతో పాటు రాజకీయాలపై అవగహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
సరైన నాయకున్ని ,ఎన్నుకోవడంలో ,దేశంలో ఉన్న ఆర్థిక ,సామాజిక, న్యాయ ,నిరుద్యోగ ,విద్యా వైద్యంపై ,అవగాహన కలిగే నాయకులపై దృష్టి పెట్టి దేశ, రాష్ట్ర , అభివృద్ధిని చేపట్టేలా రాజకీయ నాయకులని ఎన్నుకోలని ,విద్యార్థులని యువతి యువకులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు యువత వెన్నెముక లాంటి వారని, రాజకీయాల పట్ల కళాశాల స్థాయి నుండి ఆసక్తి చూపాలని అన్నారు. ప్రిన్సిపాల్ రంగారెడ్డి, అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు