పెండింగ్లో ఉన్న రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ చిల్పూర్:

~
చిల్పూర్: మండలంలో వివిధ గ్రామాల్లోని రైతులు తాసిల్దార్ కార్యాలయంలో దరఖాచేసుకున్న పెండింగ్ భూ సమస్యలను
తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతుల చే తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి సాధం రమేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ
గత రెండు సంవత్సరాల నుండి మండల తహసిల్దార్ కార్యాలయంలో రైతుల భూ సమస్యలను పరిష్కరించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు ఈ సమస్యపై తాసిల్దార్ గారిని ఆ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తే ప్రజల కోసం పనిచేసే సిపిఎం మండల కార్యదర్శి పాదం రమేష్ పై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం మంచిది కాదన్నారు సిపిఎం పార్టీ అధికారులకు వ్యతిరేకం కాదన్నారు అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తాసిల్దార్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా రైతులను చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు డిఎస్ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు రిజిస్ట్రేషన్లు చేసే సందర్భంలో సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం చెప్పకపోవడం మూలంగా రైతు కుటుంబాల మధ్య తగాదాలు వస్తున్నాయని అన్నారు రైతుల తమ అవసరాల కోసం పోలియో పహాని నకలు పొజిషన్ సర్టిఫికెట్స్ కావాలని అడిగితే ఇవ్వడం లేదని అన్నారు మండలంలో భూ సర్వేయర్ లేకపోవడంతో భూతగాథలు సత్వరం పరిష్కారం కావడం లేదని పర్మినెంట్ సర్వేయర్ పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు మండలంలోà రైతుల ఎదుర్కొంటున్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బోనగిరి కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మరియు రైతులు పోల్ సంపత్ అపరాధపు రాజుగుంటి భీమయ్య బి మహేష్ డి చిన్న ఐలయ్య నలిమెల శంకర్ వెలిశాల సమ్మయ్య సుంక రాజు సాదం రాజు ఊరడి మల్లయ్య నలిమేల రవి గోలి రాజు గోలి శంకర్ గట్టయ్య వీటితోపాటు వివిధ గ్రామాలకు చెందిన బాదిత రైతులు పాల్గొన్నారు

You may also like...

Translate »