విద్యార్థుల సమస్యల పరిష్కారం కై పీడీఎస్యు ఎనలేని కృషి..!

విద్యార్థుల సమస్యల పరిష్కారం కై పీడీఎస్యు ఎనలేని కృషి..!
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 14.
విద్యారంగ అభివృద్ధికి పీడీఎస్యు ఎనలేని కృషి చేస్తుందనీ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్, ట్రస్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెగ్గు మల్లారెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు పీడీఎస్యు ఆద్వర్యంలో డోర్ స్టిక్కర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యు అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుందని కొనియాడారు.
జార్జిరెడ్డి స్ఫూర్తితో యాభై ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసి విజయాలు సాధించిందన ఘనత పీడీఎస్యు సంస్థకు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖకు తక్షణమే ప్రత్యేక మంత్రిని నియమించాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్థ తాజా మాజీ నాయకులు కొంపెల్లి విజయ్ కుమార్, కల్లెపల్లి ప్రశాంత్, కె.ఎస్.అనిల్, కోటని తిరుపతి, అడ్వకేట్ శివ కుమార్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.