పర్వేద ఎంపీటీసీ చేగూరి వెంకట్ రెడ్డి కి ఘనంగా సన్మానం

పర్వేద ఎంపీటీసీ చేగూరి వెంకట్ రెడ్డి కి ఘనంగా సన్మానం
– మరొన్నో గొప్ప పదవులు ఆశించాలి – పర్వేద మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్
– కార్యక్రమం లో పాల్గొన్న గ్రామ ప్రజలు, యువజన సంఘాల నేతలు.
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి, జులై 10:
బుధవారం మండల పరిధి పర్వేద గ్రామంలో ఐదు సంవత్సరాల పదవీ కాలం విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా పర్వేద ఎంపిటిసి వెంకటరెడ్డికి పర్వేద గ్రామ ప్రజలు యువజన సంఘాలు శాలువాలతో పూలమాలలతో స్వీట్లు పంచి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పర్వేద మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎంపీటీసీగా తన 5 సంవత్సరాల పదవికాలంలో నిజాయితీగా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో అహర్నిశలు పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళ్లిన యువ నాయకుడు వెంకట్ రెడ్డి అని కొనియాడారు. రానున్న రోజుల్లో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు పొంది, ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్వేద మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ ఎల్లయ్య, వార్డ్ మెంబర్స్, రవీందర్, నాగేష్, బుచ్చిరెడ్డి, వెంకటేష్ ,జంగయ్య , కో ఆప్షన్ సభ్యులు, సుధాకర్ గౌడ్, జాంగిరి, జైపాల్ రెడ్డి, సుబన్ రెడ్డి ,గ్రామ పంచాయతీ అధికారి వసంత, కారోబార్ యాదగిరి,కిష్టారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,ఆనంద్,సత్యనారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రావణ్,కుమార్, బద్రి వెంకటేష్ గౌడ్, బద్రి కుమార్, బైండ్ల జగదీష్, బైండ్ల వెంకట్, తొంట చందర్, బోడ జేలంధర్, సిద్దులూరి లక్ష్మణ్, పండిత్ గౌడ్, ప్రకాష్, బుగ్గ శ్రీకాంత్ గౌడ్, కటికే సతీష్, ఖాదర్, బద్రి యాదయ్య, వాటర్ రవి, యువజన సంఘాలు పాల్గొన్నారు.