ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జరిచేయవద్దని పి.డి. యస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డి. టి. ఓ అఫ్రీన్ సిద్ధిక్ అధికారి కి వినతి


జ్ఞాన తెలంగాణ ఖమ్మం మే 31
ప్రతి ఏటా మే 15లోగా స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ చేయించాల్సినా స్కూల్స్ యాజమాన్యం గడువు దాటినప్పటికి పూర్తిస్థాయిలో బస్సులకు సామర్థ్య ఫిట్నెస్ పరీక్షలు చేయించని పరిస్థితి నేడు జిల్లా కనిపిస్తుందని దానికీ ఉదాహరణ జిల్లా వ్యాప్తంగా 648 స్కూల్ బస్సు లు ఉంటే దాంట్లో ఫిట్నెస్ ఉన్న 121 అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందిన బస్సు లు కేవలం 15మాత్రమే ఉన్నాయని కావున ఫిట్నెస్ లేని బస్సు లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జరిచేయవద్దని కోరుతూ ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి అఫ్రీన్ సిద్ధిక్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…

ఈ సందర్బంగా ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ లు పాల్గోని మాట్లాడుతూ స్కూల్ బస్ లలో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మిడిల్ రాడ్స్ లేకుండానే పాత బస్ లకు కొత్త రంగులు అద్ది ఫిట్నెస్ తేవడం కోసం విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థి, తల్లితండ్రులను, అధికారులను మభ్యపెడుతున్నారాని వారి పై వారు ఆవేదన వ్యక్తం చేశారు…
జిల్లా లో ఫిట్ నెస్ లేని బస్సుల్లో రోజూ వందల మంది విద్యార్థులను తరలిస్తు విద్యార్థుల జీవితలతో చెలగాటం ఆడుతున్నారని దానికి నిదర్శనమే మొన్న కాకతీయ, బస్సు రఘునాథపాలెం మండలం లో ప్రైవేట్ స్కూల్ ల బస్సు లు ఆక్సిడెంట్ లు కావడమే అని ప్రైవేట్ స్కూల్ బస్సు ల యాజమాన్యం పై వారు మండిపడ్డారు..
జిల్లాలో కొన్ని బడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల నడుపుతూ విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి కిలోమీటర్ల పేరుతో 30వేల నుండి 50వేల రూపాయల వరకు ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్నా కూడా జిల్లా విద్యా శాఖ మరియు రవాణా శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని అధికారులపై వారు ఆవేదన వ్యక్తం చేశారు..
కావున ఫిట్నెస్ లేని స్కూల్ బస్సు లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ను జిల్లా రవాణా శాఖ అధికారులు జరిచేయవద్ద ని ఒకవేళ ఫిట్నెస్ లేని స్కూల్ బస్సు లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయడం వలన ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే జిల్లా రవాణా అధికారులు బాధ్యత వహిస్తారా లేక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా అని వారు వారిని ప్రశ్నించారు..
వినతి పత్రానికి స్పందించినా జిల్లా రవాణా శాఖ అధికారి అఫ్రీన్ సిద్ధిక్ అధికారి గారు అర్. టి. ఓ రుల్స్ కి విరుద్ధం గా కాని ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని స్కూల్ బస్సు లు రోడ్లపై నడుపుతున్న
ప్పుడు పి. డి. ఎస్. యూ బృందం స్పందించి వెంటనే అ బస్సుల యొక్క నెంబర్ మరియు స్కూల్ బస్సు నేమ్స్ మాకు తెలియజేయండిని వెంటనే అ స్కూల్ బస్సు లను సిజ్ చేస్తామన్నారు..

ఈ కార్యక్రమం లో పి.డి. యస్. యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తిప్పరపు. లక్ష్మణ్, నాయకులు కరుణ్, స్టాలిన్, వినయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. .

You may also like...

Translate »