అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం…

అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం…


జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 21


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కంచన పెళ్లి గ్రామానికి చెందిన మెరుగు అంజయ్య తన విధులు నిర్వహిస్తుండగా క్రింద పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ కు తరలించారు. కానీ హాస్పిటల్ లో వైద్యులు ఇతన్ని బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులు కిడ్నీ లివర్ కండ్లు గుండె దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

అంజయ్య గారి అవయవాలతో ఐదుగురికి ప్రాణదానం చేసి మృత్యుంజయుడుగా నిలిచాడు. అంజయ్య గతంలో వలిగొండ మరియు రామన్నపేటఎంఆర్ఓ ఆఫీసులో వీఆర్వో గా పనిచేసినాడు. ప్రభుత్వం వీధుల సర్దుబాటు ప్రకారం ఆలేరు ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు

You may also like...

Translate »