హైదరాబాద్‌లో చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ‘ఆపరేషన్ కవచ్’ : కమిషనర్ సజ్జనార్

హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేందుకు ‘ఆపరేషన్ కవచ్’ పేరిట విస్తృత స్థాయిలో నాకాబందీ చేపట్టుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ చర్య కమిషనరేట్ చరిత్రలోనే మొదటిసారి ఇంత భారీ స్థాయిలో జరుగుతుందన్నారు.

రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో నగరం మొత్తం మీద కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో …

  • లా అండ్ ఆర్డర్
  • ట్రాఫిక్
  • టాస్క్ ఫోర్స్
  • ఆర్మడ్ రిజర్వ్
  • బ్లూ కోల్ట్స్
  • పెట్రోలింగ్ టీమ్స్
    సమిష్టిగా పాల్గొంటున్నాయి. నగర భద్రతను మరింత పటిష్ఠం చేయడమే ఈ చర్య లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.

ప్రజలు పోలీసుల పని తీరుకు ప్రోత్సాహంగా సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారమివ్వాలని సూచించారు.

ఈ నాకాబందీ నగరంలో నేర నియంత్రణ, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు

You may also like...

Translate »