కొనసాగుతున్న బడిబాట.

కొనసాగుతున్న బడిబాట.
జ్ఞాన తెలంగాణ – బోధన్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం కొనసాగుతుంది. సోమవారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట్, ఎం.ఏ నగర్, గోశాల కాలనీలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జెసి) ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు.
ఈ బడి బాట కార్యక్రమంలో ఎం.ఏ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గల విద్యార్థులను ఆరవ తరగతి ఉర్దూ మీడియంలో చేర్పించారు. అలాగే మరో పది మంది విద్యార్థులను ఎనిమిదో తరగతి ఉర్దూ మీడియంలో చేర్పించారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు అఫ్షాన్, ఫర్జానా, శాకీరున్నీసా తదితరులు పాల్గొన్నారు.