చిన్నారి అపహరణ కేసులో ఒకరికి జైలుశిక్ష


జ్ఞాన తెలంగాణ – బోధన్
చిన్నారిని అపహరించిన ఘటనలో ముద్దాయికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వంద రూపాయల జరిమానాను విధిస్తూ గురువారం బోధన్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జ్ దేవన్ జకుమార్ తీర్పు వెల్లడించారు.
బోధన్ కోర్టు లైజనింగ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం 2022 నవంబరు నెలలో మేకల లక్ష్మి అనే మహిళ తన భర్తతో తలెత్తిన గొడవల కారణంగా తన చిన్న కూతురు అయిన పది నెలల పాపను తీసుకొని తల్లిగారిల్లు చిన్నమావందిలో ఉంటుంది. ఈ క్రమంలో తన చిన్న పాప ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి అదె నెల 7వ తేదిన వచ్చింది. అయితే 9వ తేదిన తన పాపతో కలిసి నాదెల్లి మసీదు వద్ద నిద్రించింది. కానీ ఉదయం నిద్ర లేచిచూసే సరికి పాప కనిపించలేదు. తన భర్త తన పాపను తీసుకెళ్లాడని ఆమే అనుమానం వ్యక్తం చేస్తూ బోధన్ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న అప్పటి ఇన్స్పెక్టర్ బీ. డీ ప్రేమ్ కుమార్ కేసు నమోదు కేసు నమోదుచేసి ఎస్ఐ నవీన్ తో ధర్యాప్తు పూర్తి చేశారు. ఈ ధర్యాప్తులో గంగమణి, అంజలి, షామీంబేగo, షహనాజ్ పర్వీన్ లను పట్టుకుని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య వాదించినారు.దాంతో బోధన్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ పూర్తి విచారణ చేపట్టి ముద్దాయి చిన్నకుట్ల గంగామణికి ఏడాది పాటు కఠిన కారాగార శిక్షతో పాటు 100 రూపాయల జరిమానా విధించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో 15 రోజులపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో సహకరించిన ఏసీపీ శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ వీరయ్య, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శంకర్, కోర్టు పోలీసులు లక్ష్మణ్ గణేష్ లు ఉన్నారు.

You may also like...

Translate »