మరోసారి దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు. ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు

మరోసారి దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు
నెల 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 21వ తేదీ నుంచి మరోసారి దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.అంతేకాకుండా ఆయా కళాశాలలు అక్టోబరు 3, 4 తేదీల్లో స్పాట్‌ ప్రవేశాలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి శనివారం నాడు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో చేరిన వారు అదే కళాశాలలో మరో కోర్సుకి మార్చుకునేందుకు ఇంట్రా కాలేజీ రెండో విడతకు కూడా అనుమతి ఇచ్చారు. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వారందరికీ వారికి ఈ నెల 21న సీట్లు కేటాయిస్తారు.

You may also like...

Translate »