జూన్ రెండో తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి

జూన్ రెండో తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి:
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం నుండి అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపిఓలతో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహణ ఏర్పాట్లుపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాన్ రెండో తేదీన ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఆయన సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శనివారం వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపాన్ని అందంగా ముస్తాబు చేయాలని మున్సిపల్
కమిషనర్ ను ఆదేశించారు. పండుగ వాతావరణంలో ఈ విశిష్టమైన రోజును ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఎలాంటి, నిర్లక్ష్యం ఏమరపాటుకు తావులేకుండా వేడుకను ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఆయన సూచించారు. ఐడిఓసి కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది
ఐడిఓసి కార్యాలయానికి ఉదయం 8:30 గంటల వరకు చేరుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి మినహాయింపు లేదని అందరూ విధిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా అంతటా వేడుక పండుగ వాతావరణంలో జరగాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.