పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా, సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు.

ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూర్వ విద్యార్థ్దులు సాయంత్రం వరకు సందడిగా గడిపారు. జడ్పిహెచ్ఎస్ పాఠశాల 1998-99 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు.

ఈ కార్యక్రమంలో డి.రాజు, బియ్యం రమేష్, పి.సురేష్ , మంజుల, మాధవి, నవీన్, బాలకిషన్, రజిత, నర్సింలు, తోటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...

Translate »