ఆయిల్ ఫామ్ మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమం:

ఆయిల్ ఫామ్ మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమం:
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:
నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామములో ఆయిల్ పామ్ క్రాప్ కటింగ్
ఆదర్శ రైతు నాగేదర్ గారు మొదటి మొక్క నాతో నాటించారు. ఇప్పుడు పంట కోత నా చేతుల మీదుగా చేస్తున్నాను, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.
పంట పండినందుకు రైతుకు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ పంటను ఇక్కడ పరిచయం చేసిన ప్రజా ప్రతినిధిగా నాకు అంతే సంతోషం ఉంది.
జూన్ 2021 లో నంగునూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఈ పంటను మొదటి సారి వేయడం జరిగింది. అలా మూడేళ్ల క్రితం అయిల్ ఫామ్ సాగు ప్రారంభించాం ఎలారెడ్డి గారి పొలంలో మొదటి ఆయిల్ ఫామ్ మొక్క నాటాం,నాగేందర్ గారి పొలంలో మొదటి పంట కోసుకుంటున్నం ఆయిల్ ఫామ్ పంట అంటే చాల మంది రైతుల్లో అనుమానాలు ఉండేవి, మన రాష్ట్రంలో కూడా రైతులు లాభం పొందాలని ఇక్కడ ప్రారంభం చేశాం.లో, ఆయిల్ ఫామ్ ప్రకృతి ప్రసాదించిన వరం.
రైతులు ఎదగడానికి దోహదపడుతుంది. ఇది చాలా సులువైన పంట, స్థిరమైన ఆదాయం,ఏడాది అంతా లాభమే కమ్మ కొట్టు, గెల కొట్టు, చెక్కు తెచ్చుకో అన్నట్టు ఉంటుంది. ఎకరాకు లక్షా 20 వేల ఆదాయం వరకు ఉంటుంది, ఆరుగాలం శ్రమించే రైతన్నకు లాభం చేయాలని కెసిఆర్ గారు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రోత్సాహం అందించారు.300 కోట్లతో 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరుగుతున్నది.దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ మనకు రావడం సంతోషకరం.
ఫ్యాక్టరీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, ఏప్రిల్ 25 నాటికి ప్రారంభించు లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆయిల్ ఫామ్ కు సిద్దిపేట హబ్ అవుతుంది,కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహించాలి,ఎంతో కష్టపడి కాళేశ్వరం ద్వారా నీళ్ళు తెచ్చాం, కరెంటు ఇచ్చాం,మంచి పంటలు పండాలి. రైతులకు లాభం జరగాలి అన్నది మా కోరిక.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పామ్ ఆయిల్ రైతులను చిన్న చూపు చూస్తున్నది.వానాకాలం వచ్చింది, కానీ రైతులకు పంట పెట్టుబడి సహాయం గురించి కాంగ్రెస్ నోరు మెదపడం లేదు.బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో వాన చినుకు పడితే రైతు బంధు పైసలు పడేవి,ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న షరతులు లేకుండా ఎకరాకు రూ. 7500 ఇవ్వాలి.
ప్రసంగాల్లో, మ్యానిఫెస్టోలో పంట కాలానికి ముందే ప్రతి ఎకరాకు ఇస్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడు రైతులను మోసం చేయడం సరికాదు. పంట ప్రారంభం అయ్యింది. విత్తనాలు వేస్తున్నారు. రైతు భరోసా వేయడం లేదు, కెసిఅర్ బస్సు వేసుకొని అడిగితే రైతు బంధు కొందరికి వేశారు.
ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి సారించాలని అన్నారు.