రోడ్డు మరమ్మత్తులకు స్పందించి అధికారులు

రోడ్డు మరమ్మత్తులకు స్పందించి అధికారులు
జ్ఞాన తెలంగాణ న్యూస్ కథనానికి స్పందన
జ్ఞాన తెలంగాణ (హైదరాబాదు న్యూస్)గత కొన్ని నెలల క్రితం రోడ్డు పైపులకోసం తవ్వి చదును లేకుండా పూడ్చివేయడం కంకర తేలడం నిత్యం ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు స్థానికులు అవస్థలు పడుతుండటం తో గత నెల్ 15 వ తేదీన జ్ఞాన తెలంగాణ లో మరమ్మత్తులకు నోచుకోని జియాగుదా రోడ్డు నే కథనం పత్రికలో రావడంతో స్పందించిన అధికారులు కంకర తెలిన రోడ్డుపై చదును చేసి వాహనాలకు ఇబ్బందులు కలగకుండా దాంబర్ తో తాత్కాలిక మరమత్తులు చేశారు.హైదారాబాద్ లోని పురనాపుల్ నుంచి గోపి హోటల్ నుంచి రంగనాధ స్వామి దేవాలయం వరకు కొన్నేళ్లుగా తవ్వి పైపులు వేసి పూడ్చి వేసి చదును చేయక పోవడం తో ప్రధాన రహదారి మార్గం కంకర తేలి దుమ్ము ధూళితో వాహనదారులు కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతుండటం తో ఇది జ్ఞాన తెలంగాణ కథనం ద్వారా సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే కంకర తేలిన రోడ్డుపై వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక నగా చదును చేశారు.రెండు కిలో మీటర్ల మేర ఇలా ఉండడం తో చాలా అవస్థలు పడ్డామని ఇప్పుడు సుఖవంతమైన ప్రయాణం జరుగుతుంది అన్నారు.