డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పై తప్పుడు ప్రచారం చేయిస్తున్న ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి క్షేమాపణ చెప్పాలి.

డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పై తప్పుడు ప్రచారం చేయిస్తున్న ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి క్షేమాపణ చెప్పాలి.

NRI గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బోడ 19.09.2023 పేస్ బుక్ లైవ్ లో డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పై అణిచిత వాక్యాలు చేసారు అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఈ తప్పుడు ప్రచారం చేయిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షేమాపణచెప్పాలి
లేదంటే గాంధీ భావన్ ముందు ధర్నాకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణాలో కతం చేస్తాం అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ డా”అరుణ క్వీన్ గారు తెలిపారు.

బహుజనులపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తే తెలంగాణ మహిళలు చీరి చింతాకు కడతారు అని,75 సంవత్సరాలు గా వివిధ పథకాల తో,బహుజనములను కులాలుగా,మతాలు గా విభజించి పరిపాలించి మమ్మల్ని కలవనీయకుండా వివిధ పథకాలతో బాలన్స్ చేస్తూ బహుజనుల్ని బానిసల్లా వాడుకున్నారని మీరు చేస్తున్న ఈ దుశ్చర్యలను ప్రతి గడపకు చేరుస్తున్నందుకు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఇలా విష ప్రచారం చేయడం తగదని అన్నారు.
మీకు దమ్ముంటే మీ పార్టీని సక్కదిద్దుకొండి,సీనియర్స్ ని గౌరవించడం నేర్చుకోండి,అనవసరంగా బూతులు తిట్టిస్తే ఊరుకోమని,మీరు మీ పార్టీలో పెంచి పోసిస్తున్న బూతు పురాణాన్ని నిజాయితీగా పేద ప్రజలకోసం పనిచేసే వారి పై ఉపయోగించడం మానుకోవాలని కితాబిచ్చారు.

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకురాలు నర్రా నిర్మల గారు మాట్లాడుతూ రాజ్ బోడ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని ఆయనను నడిపిస్తున్నది ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి నే నని ఎట్టి పరిస్థితిలో ఈ విషయాన్నీ వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డి వెంటనేక్షేమాపణ చెప్పాలి అని అన్నారు.


బహుజనసమజ్ పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి శీలం అనితారెడ్డి గారు మాట్లాడుతూ..
మాయావతి గారిని దుర్భాషలాడుతూ పెట్టిన ఈ లైవ్ ని వెలది మంది బహుజనులు చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ఈ తతంగం అంత చేయిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే క్షేమాపణ చెప్పాలని అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతి క్షణం ప్రజా క్షేత్రంలో ఉండి వారి అభ్యున్నతి కొరకు ప్రకటించిన పథకాలను పథకాలను కాఫీ కొట్టి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్న మీకు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని అన్నారు.
ఇప్పటివరకె X వేదికగా మా అధినేత బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారని లేదంటే తెలంగాణ లోని బహుజనులం ఏకమై మిమిల్ని గ్రామాల్లో తెరగనియ్యం అని వారు అన్నారు.

స్వేరోస్ నెట్వర్క్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని లక్షలాది మంది పేద బిడ్డలను ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్న దేశంలోనే ఏకైక సంస్థ స్వేరోస్ అని,దశాబ్ద కాలంగా అక్షరం,ఆరోగ్యం ,ఆర్థికం ప్రధాన సిద్ధాంతాలు గా పనిచేస్తుందని స్వేరోస్ చరిత్ర తెలుసుకోవాలి అంటే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూసుకోవాలని వారు కితాబు ఇచ్చారు.

తెలంగాణలో జీరో గా ఉన్న పార్టీ ని అత్యంత శక్తివంతమైన పార్టీ గా నిర్మిస్తున్నందుకు ఓర్చుకోలేక ఎలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు తాము భావిస్తున్నామని వారు తెలిపారు,ఇలాగె రిపీట్ అవుతే మీ పార్టీని తెలంగాణలో ఉనికి లేకుండా చేస్తాం అని అన్నారు.

You may also like...

Translate »