ప్రైవేటు పాఠశాల వద్దు గవర్నమెంట్ పాఠశాల ముద్దు

ప్రైవేటు పాఠశాల వద్దు గవర్నమెంట్ పాఠశాల ముద్దు
జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 08-06-2024 ఈరోజు కొడకండ్ల మండల కేంద్ర లోని ప్రాథమిక పాఠశాల హరిజన కాలనీ స్కూల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులు డి ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులను సమీప కాలనీలోని తల్లిదండ్రులకు పెద్దలకు మరియు ఇతరులకు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఎట్లా ఉంటది అలాగే ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటే ఏవిధంగా ఉంటది అని రెండిటి మధ్య తేడాను వివరించి చెప్పడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ శిక్షణ పొందిన వారై ఉంటారు కావున మీ యొక్క మీ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపించవలసినదిగా వివరించడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమం కి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, స్కూల్ సిబ్బంది మరియు కమిటీ మెంబర్లు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
