ముస్లిం మహిళా ఓటర్లపై నిలదీసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి

తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 1 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.
నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీలో నిలిచిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవహారశైలి విమర్శలకు తెర తీసింది. పోలింగ్ స్టేషన్లో ఆయన వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.

నిజామాబాద్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో ధర్మపురి అరవింద్.. ఎన్నికల సిబ్బందితో వాగ్వివాదానికి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముస్లిం మహిళా ఓటర్లు.. పోలింగ్ కేంద్రంలో బురఖా ధరించి రావడం ఆయన అసహనానికి కారణమైంది. బుర్ఖా ధరించడం వల్ల వారిని గుర్తు పట్టలేమన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఓటు వేసే సమయంలో బురఖా ధరించాల్సిన అవసరం లేదని ధర్మపురి అరవింద్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది, ప్రిసైడింగ్ అధికారి వద్ద ప్రస్తావించారు. బుర్ఖా వేసుకుంటే ఓటు వేయడానికి ఎవరు వచ్చారనేది ఎలా తెలుస్తుందని నిలదీశారు.

పోలింగ్ కేంద్రంలో డ్యూటీ చేస్తున్నారా? లేక టైమ్ పాస్ చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ముస్లిం మహిళలు తమ ప్రాబ్లమ్ చెప్పినంత మాత్రాన వారికి ఎలా ఓటు వేయనిస్తారని ప్రశ్నించారు. మన ఓటరా? కదా? అనేది ఎట్లా తెల్వాలి మీకు.. అని ఎన్నికల సిబ్బందిని ప్రశ్నించారాయన.

You may also like...

Translate »