నమో బుద్ధాయ

బుద్ధుడు సుమారు 40 సంవత్సరాల పాటు ధర్మాన్ని ప్రచారం చేసెను.శ్రావస్తి ,రాజగృహ,కపిలవస్తు, వైశాలి వంటి ప్రదేశాలు అలాగే ఉగ్రధ,నాదిగ, అశ్వపుర, గోష్టితారా, మగధ, అపనాధ, ఏతమ, ఉపాసద,ఇచ్చానుకల, చందలకప్ప, కుశునగరం వంటి ప్రదేశాలు ,కోసల, మగధ,అంగ వంటి దేశాలలో ధర్మాన్ని బోధించెను.బుద్ధుడు కాలి నడకనే వేలాది మైళ్ళు పర్యటించారు. బుద్ధుడు రోజుకు 5 నుండి 1౦ కి.మీ కాలి నడకన నడిచి ప్రయాణం చేసేవారు. ధర్మాన్ని ప్రజలకు బోధించడానికి బుద్ధుడు ఎంతగానో కృషి చేసెను.నేటి భిక్షువులు విలాసవంతమైన భవనాలు కట్టుకొని లేదంటే విహార్ లలో ఉంటూ ధర్మాన్ని వ్యాప్తి చేయకుండా తమలోని అజ్ఞానాన్ని, అహంకారం, అత్యాశ, సోమరితనం బయటపడకుండా జాగ్రత్తగా భక్తులను తయారు చేసుకొంటున్నారు. ధర్మాన్ని వ్యాప్తి చేయకుండా ద్రోహం చేయడం వలన బుద్ధ ధర్మం జనంలోకి వెళ్ళడం లేదు.