వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మునుకుంట్ల సర్పంచ్ నరేష్ కు సన్మానం

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, డిసెంబర్ 21 :
మండలంలోని మునుకుంట్ల గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన గుల్లి నరేష్ తో పాటు ఉప సర్పంచ్ కడారి మల్లేష్, వార్డు సభ్యురాలు ముడుసు నర్మదరామలింగయ్యలను ఆదివారం గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూలమాల, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ యువత, గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ముడుసు అనిత, ముడుసు భిక్షపతి, ముడుసు రామకృష్ణ, యూత్ అధ్యక్షులు నూకబత్తిని కృష్ణంరాజు. చింతపల్లి యాదగిరి, కొంపెల్లి రవి, యాపాల సంతోష్ రెడ్డి, ముడుసు రామలింగయ్య, సైదులు, ముడుసు శంకర్, ముడుసు నర్సింహ్మ, ముడుసు ఉమా శంకర్, ముడుసు శ్రీ శైలం, నూకబత్తిని క్రాంతి, బండ్ల అనిల్. అల్లి సుధాకర్, మద్దెల జలంధర్, అంజమ్మ, ఎల్లమ్మ, లలిత, యాదమ్మ, కనకమ్మ పాల్గొన్నారు.

You may also like...

Translate »