విద్యార్థులకి పుస్తకాలు, నోట్ బుక్స్, మరియు యూనిఫామ్ అందజేస్తున్న మునిసిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ గారు

జ్ఞాన తెలంగాణ శంకర్ పల్లి జూన్ 13

శంకరపల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ , ప్రాథమిక పాఠశాల సందర్శించారు పండుగ వాతావరణం లో పాఠశాలలో పునప్రారంభం చేసుకోవడం జరిగినది.
మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు
వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో
ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. రెసిడెన్షియల్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా మంచి విద్యను బోధించడం జరుగుతుంది. ఉచితంగా అందిస్తున్న విద్యను అభ్యసించి పై స్థాయికి వెళ్ళాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ ,ప్రధానోపాధ్యాయులు, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ,కౌన్సిలర్ శ్వేతా పాండురంగారెడ్డి ,మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »