ముత్తి రెడ్డి గూడెం గ్రామంలో ముగ్గుల పోటీ..

జ్ఞాన తెలంగాణ, భువనగిరి జనవరి 14 :


సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముత్తి రెడ్డి గూడెం గ్రామం లోని శివాలయ ప్రాంగణంలో మాజీ ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేసి అలరించారు,తెలుగు సంప్రదాయం పండగ విశిష్టత ప్రతిభంభించేలా ఔరా అనిపించారు, వాటిలో మెటీగా వేసిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సూలేషన్ బహుమతి గా ఒక చీరను అందించి తెలుగుదనం ఉట్టిపడేలా వచ్చిన ప్రతి ఒక్కరిని సంతోష పరిచారు ఈ సందర్బంగా మాజీ ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ సంక్రాoతి పండగ సందర్బంగా ముగ్గుల పోటీలు మహిళల కోసం నిర్వహించడం ఆనందం గా ఉండటం తో పాటు గ్రామం లో అందరు ఓకే చోటకి రావడం వలన
పలకరింపులతో పండగ వాతావరణం నెలకొందని అంతేగాకుండా తరతరాల సాంప్రదాయం గా వస్తున్నా ఈ కళను ఓపికతో, నైపుణ్యం తో చుక్కలు పెట్టి గీతలు గీసి రంగుల హరివిల్లు లాగా చేయడం అది మహిళా మణులకే సాధ్యం అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మహిళలు యువకులు అత్యధికoగా పాల్గొన్నారు

You may also like...

Translate »