ఎమ్మార్పిఎస్ గ్రామ కమిటీ సమావేశం

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట ప్రతినిది, జనవరి 28:నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామం లో ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 07న హైదరాబాద్ లో యస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలనీ డిమాండ్ తో జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతుల మండే మాదిగల గుండె చప్పుడు మహా ప్రదర్శన విజయవంతం చేయాలని దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామం లో ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో గ్రామ మాదిగ యువత పెద్దలు లక్ష డప్పులు వేల గొంతులమండే మాదిగల గుండె చప్పుడు మహా సాంస్కృతిక ప్రదర్శనకు ప్రతి మాదిగ ఇంటికి తాళం పెట్టి ఇంటిలో అందరు సంకకు డప్పు వేసుకొని హైదరాబాద్ చేరుకొని మాదిగల శక్తిని ఈ ప్రపంచానికి చూపెట్టాలి అని పిలుపు నివ్వడం జరిగింది.నూతన గ్రామ శాఖ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పియస్ అధ్యక్షులు అశప్ప.మాదిగ, ఉపాధ్యక్షులు లాలప్ప,ప్రధాన కార్యదర్శి మొగులప్ప, శ్యాంసుందర్, జీ,లాలు, రమేష్, రవి, ఉషేనప్ప,గోవిందు ,బసప్ప,మండల సీనియర్ నాయకులు ఎంపీపీ బక్క నర్సప్ప,ఉపాధ్యక్షులు, యు అశోక్ ఆనంద్, వెంకట్,
తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »