ఎంపీపీ బుద్దె సావిత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


కామరెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం బోధన్ మండల ఎంపీపీ బుద్దే సావిత్రిని పరామర్శించారు.సాలూర మాజీ ఎంపిటిసి బుద్ధి రాజేశ్వర్ గత 15 రోజుల క్రితం ఆకస్మికగా మృతి చెందడం వలన సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుద్దె రాజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధె రాజేశ్వర్ మంచి రాజకీయ నాయకుడిగానే కాకుండా పెరిక సంఘ అభివృద్ధికి తన వంతు సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం మాకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తి ఇలా ఆకస్మికంగా మృతి చేయడం బాధాకరమన్నారు. ఆయన వెంట పెరిక సంఘం నాయకులు ఇల్తేపు రమేష్, ఇల్తెపూ శంకర్, బొర్ర గంగయ్య, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ షకీల్, కన్నె లక్ష్మణ్, శంకర్ తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »