ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సతీమణి మన్నె టిఆర్ఎస్ పార్టీ ప్రచారం :

ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సతీమణి మన్నె టిఆర్ఎస్ పార్టీ ప్రచారం :జ్ఞాన తెలంగాణ,నారాయణపేట టౌన్, మే 4:నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని కానుకుర్తి గ్రామం లో బి.ఆర్.ఎస్ ప్రజాపతినిధులు గౌరవ బి.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్తి శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి మన్నే గీతారెడ్డి గారు స్థానిక ఈశ్వర దేవాలయం లో పూజలు నిర్వహించి పార్టీ ప్రచారం ప్రారంభించడం జరిగింది.కెసిఆర్ గారి ప్రభుత్వంలో రైతులకు రైతుబంధు, రైతు భీమా వంటి, ఉచిత విద్యుత్ ,సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాబట్టి మీరందరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని విజయవంతం చేయాలని కోరుతున్నా అని గ్రామస్తులకు తెలియపరచారు. ఇట్టి కార్యక్రమం లో కానుకుర్తి గ్రామ సీనియర్ నాయకులు యువనాయకులు పార్టీ శ్రేణులకు , కార్యకర్తలు, కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని మీ బిడ్డను దీవించాలని తెలిపారు.