ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

జ్ఞాన తెలంగాణ
జఫర్ గడ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

-స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మంచాల ఎల్లయ్య గారు

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మంచాల ఎల్లయ్య గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ గుర్తించి వరంగల్,ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషమైన విషయం అని అన్నారు.మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు విజ్ఞతతో ఆలోచించి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే ప్రశ్నించే గొంతుక అయినా తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓటు వేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

You may also like...

Translate »