బిజెపి, బీఆర్ఎస్ నాయకుల మాటలు విని మోసపోవద్దు.- ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..

బిజెపి, బీఆర్ఎస్ నాయకుల మాటలు విని మోసపోవద్దు.- ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..
అందాపూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సుదర్శన్ రెడ్డి. జ్ఞాన తెలంగాణ- బోధన్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్, బిజెపి పార్టీలు చెప్పే మోసపూరిత మాటలను నమ్మి జనం మోసపోవద్దని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం బోధన్ మండలం బిల్లాల్, అమ్దాపూర్ గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుపేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ఛేరుతాయని అన్నారు. గ్రామంలోని కొంతమంది బిఆర్ఎస్ నాయకులు బీజేపి లో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. మీ గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు కాబట్టి మీకోసం మొరం రోడ్లు వెంటనే మంజురు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గంగపుత్రులకోసం చేపలు అమ్ముకోవడానికి వారికి షెడ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు.కటాఫ్ తేది లేకుండా బీడీ కార్మికులకు ఫించన్ మంజూరు చేస్తామని అన్నారు.బీజేపి పార్టీ కుల, మతాల్లో చిచ్చు పెట్టీ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. గతంలో మోడీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి సంవత్సరం యువతకోసం 2 కోట్ల ఉద్యోగాలు,ఉపాధి హామీ కూలీలకు నెలకు 15 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తానన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు? ఒకపక్క డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని పేర్కోన్నారు.సంవత్సరంలోపు బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రారంబించి కార్మిక,కర్షకుల కష్టాలను కడతేరుస్తామని హామీ ఇచ్చారు.అనంతరం పోరెడ్డి గంగాధర్ నాయకత్వంలో గ్రామ బిఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కండువా కప్పి కాంగ్రస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గంగా శంకర్ బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, అందాపూర్ మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి గంగాధర్, డిసిసి ప్రధాన కార్యదర్శి బొర్ర పల్లన్న, సొసైటీ డైరెక్టర్ జయ రాజు, మైనార్టీ సెల్ నాయకులు రఫీ, బెల్లాల్ సతీష్, సంజీవ్, కంటిగౌడ్, అశోక్ రెడ్డి, బల్లెపు నర్సయ్య, ఖాదర్, పాషా తదితరులు పాల్గొన్నారు.