బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హుడా కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ శాసనసభ సభ్యులు ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ కూడా బడిలో చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లలను బడిలో చేర్పించి వారి చదువులకు తోడ్పడాలని సూచించారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందిస్తున్నారని తెలియజేశారు.స్కూల్ లో చేరిన చిన్నారులతో అక్షరాబ్యాసం చేయించారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న శంషాబాద్ జడ్పిటిసి నీరటి తన్విరాజ్, మున్సిపల్ చైర్మన్ సుష్మ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్,ఎంపీపీ జయమ్మ కౌన్సిలర్ కొనమల శ్రీనివాస్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like...

Translate »