విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి…

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి…
13-06-24(గురువారం )-
జ్ఞాన తెలంగాణ న్యూస్ పెనుబల్లి…
పెనుబల్లి మండలం – V M బంజర్ లో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో ప్రొ” జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించి, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠ్య పుస్తకాలు , స్కూల్ యూనిఫామ్స్ అందించిన సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ రాష్ట్ర చరిత్ర లోనే స్కూల్స్ తెరిచిన మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్స్ మొత్తం ఒకటే సారి అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కీ ధన్యవాదములు తెలిపారు….విద్యార్థిని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి భవిష్యత్ లో ఉండాలి అని చిన్నారులను ఆశీర్వదించారు…ఈ కార్యక్రమం లో ఎంఈఓ, ఎమ్మార్వో, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థి,విద్యార్థిని తల్లి తండ్రులు, పెనుబల్లి గ్రామం , మండలం కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు…