రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..

రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీ రావు గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురించేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రామోజీ రావు గారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్షర యోధుడు, పత్రికా రంగానికి నూతన ఒరవడిని సృష్టించిన గొప్ప మహానుభావుడు రామోజీ రావు గారని అలాంటి వ్యక్తి ఇక మన మధ్య లేడు అనే విషయం చెప్పడానికే చాలా బాధగా ఉందని అన్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎదిగిన గొప్ప దార్శినికుడు రామోజీ రావు గారని తెలిపారు. మీడియా రంగంలో, సినిమా రంగంలో ఆయన అందించిన సేవలు మారువాలేనివని, రామోజీ రావు గారిని కోల్పోవడం దేశానికి తీరని లోటని తెలిపారు.
