స్టేషన్ ఘనపూర్ ఏరియా అస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..

జనగామ జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి విధులకు హాజరు కానీ వైద్యుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే కడియం…..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కంద్రంలోని ప్రభుత్వ ఏరియా అస్పత్రిని, పీహెచ్ సీ అస్పత్రిని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఎమ్మెల్యే గారు తనిఖీ చేసిన సమయంలో అస్పత్రిలో 8మంది వైద్యులకు 5గురు వైద్యులు విధులలో లేకపోవడంతో వెంటనే డ్యూటీ రిజిస్టర్ పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లీవ్ పెట్టకుండా ఎందుకు విధులకు హాజరు కాలేదని వైద్యులను ప్రశ్నించారు. వెంటనే జనగామ జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి విధులకు హాజరు కానీ వైద్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ అస్పత్రిలో ఇప్పటికే డయాలసిస్ సెంటర్ మంజూరు అయిందని తెలిపారు. అలాగే ప్రసూతి మహిళకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాల్సి ఉందని మరియు 100పడకల అస్పత్రిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలోనే అస్పత్రిలో మౌలిక వసతుల కల్పించడంతో పాటు అస్పత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »