మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జీఎస్సార్ పరామర్శ.

మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జీఎస్సార్ పరామర్శ.
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 27:
చిట్యాల/మొగుళ్లపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన దుంప సాయి చరణ్ అదేవిధంగా, చిట్యాల మండలం వెంకట్రావ్ పల్లి(సీ) గ్రామానికి చెందిన ముడుతనపల్లి లక్ష్మీ ఈరోజు మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం వారి మృత దేహాలను చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హుటాహుటిన చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను వారి బందువులను అడిగి తెలుసుకుని, విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రభుత్వం నుండి కూడా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అక్కడున్న మొగుళ్లపల్లి ఎస్.ఐ, డాక్టర్ ని పోస్టు మార్టం త్వరగా అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.