మైనార్టీ మోర్చా అధ్యక్షుడుగా సయ్యద్ ఫరీద్ ఖాద్రి

మైనార్టీ మోర్చా అధ్యక్షుడుగా సయ్యద్ ఫరీద్ ఖాద్రి
మహేశ్వరం మండల అధ్యక్షులు సిద్ధోజి మాధవాచారి
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
బిజెపి మహేశ్వరం మండల మైనార్టీ మోర్చా అధ్యక్షుడుగా సయ్యద్ ఫరీద్ ఖాద్రి ని బీజేపీ మహేశ్వరం మండల అధ్యక్షుడు సిద్ధోజి మాధవాచారి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షతన నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం సమిష్టిగా కలిసి పని చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య గౌడ్ ,రంగారెడ్డి జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్, మహేశ్వరం మండలం ప్రధాన కార్యదర్శి గొల్లూరి శ్రీశైలం, ఆకుల నరేష్, బీజేవైఎం పోతురాజు చింటూ తదితరులు పాల్గొన్నారు.