కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం రూరల్ ప్రతినిధి 24 :
కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో ఇటీవల గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి రామి రెడ్డి మాతృమూర్తి అయినా శ్రీమతి ఎడవల్లి మాణిక్యమ్మ గారు మృతి చెందడంతో ఈరోజు నా ఉదయం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎడవల్లి రామిరెడ్డిని పరమార్శించి మనోధైర్యం కల్పించారు మాణిక్యమ్మ గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని
ఆమె మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి బజ్జూరి వెంకట్ రెడ్డి లింగారెడ్డి భీష్మాచారి రమేష్ రెడ్డి చాట్ల పరుశురాం భయ్యా వినయ్ స్థానిక నాయకులు బండ్ల మంగిరెడ్డి పుల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రామిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు