అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ ను కలిసిన

అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ ను కలిసిన
మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
కొంగర కలాన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ ని బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కలసి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని కుర్మల్ గూడా లోని జన్నురం కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న భవనాలను ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక వైద్యశాల అంగన్ వాడి కేంద్రం కోసం కేటాయించాలని అలాగే ఈ విద్య సంవత్సరం నుండి అక్కడి పాఠశాల లొనే తరగతులు ప్రారంభించేలా చూడాలని కోరారు.అలాగే వైద్యం సైతం అక్కడే నిర్వహించేలా చూడాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి వినతి పత్రం అందజేశారు.
