ఉమ్మడి.జిల్లాలో.గెలిచిన పార్లమెంట్ సభ్యులు. రఘువీర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలకు అభినందనలు

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

జ్ఞాన తెలంగాణ వలిగొండ,జూన్ 3

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయం సాధించిన పార్లమెంటు సభ్యులు. కుందూరు రఘువీర్ రెడ్డి చామల. కిరణ్ కుమార్ రెడ్డి లకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ శుభాకాంక్షలు.అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి.జిల్లా అధ్యక్షులు. సంగిశెట్టి క్రిస్టఫర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి వారు అధికారంలోకి రావడానికి ఉద్యమకారుల ఫోరం కృషి ఉన్నదని అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి గెలుపులో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాల బలిదానాల వలన.అధికారంలోకి వచ్చి అలాంటి త్యాగాలని రోడ్డున పడేసి ఉద్యమకారుల ఉసురు తగిలి నామరూపాలు లేకుండా పోయిందని ఆయన అన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25 వేల రూపాయల పెన్షన్ మిగతా రాయితీలు పక్క రాష్ట్రం ఝార్ఖండ్లో ఉద్యమకారులను గుర్తించి గౌరవ వేతనం ఇస్తూ గౌరవిస్తున్నారని మన ప్రభుత్వం కూడా ఉద్యమకారులను గౌరవించాలని. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో చరిత్ర తిరగరాయాలని ఆయన అన్నారు

You may also like...

Translate »