నీట్ లో ర్యాంకు సాధించిన సిరి సహస్రను సన్మానించిన హెల్పింగ్ హ్యాండ్స్ క్రికెట్ క్లబ్ సభ్యులు

కాగజ్‌నగర్‌ పట్టణంలోని మేయిన్ మార్కెట్ కు చెందిన సీనియర్ రిపోర్టర్ దాసరి లక్ష్మణ్, మమత ల కుమార్తె దాసరి సిరి సహస్ర ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలో మంచి ప్రతిభ కనబర్చి 560 మార్కులు సాధించడం జరిగింది. బుధవారం ఈ సందర్భంగా వారి నివాసంలో హెల్పింగ్ హ్యండ్స్ క్రికెట్ క్లబ్ సభ్యులు విద్యార్ధిని సిరి సహస్రను, తల్లిదండ్రులు లక్ష్మణ్ మమతలను సాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. మొదటి అటెమ్ప్ట్ లోనే 560 మార్కులు సాధించడం గొప్ప విషయమని మంచి కాలేజ్ లో సీట్ పొంది డాక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీలు వేముల మధు, కిరణ్, నాగరాజు, రమేష్, సభ్యులు బీ. రమేష్, జిబీ భాయ్, జే. సతీష్, వేంకటేష్, రాఖీ, దాసరి శ్రీనివాస్, శ్రావణ్, ఎం. సతీష్, తిరుపతి, వెల్దండి వంశీ, రాధాకృష్ణ, డీ.వేంకటేష్, నర్శింగ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »