పేరుకే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు..జై బి ఆర్ఎస్ అనే నినాదమే వినబడని సభలు.

Image Source | naveengfx
పేరుకే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు……..కొట్టేది జై తెలంగాణ నినాదాలు………..మరి జై బిఆర్ ఎస్ అనేది ఎవరు?
జై బిఆర్ఎస్ అనే నినాదమే వినబడని సభలు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని తెలియగానే రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో అలజడి మొదలయ్యింది.ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు ప్రాంతీయ,జాతీయ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ల వాళ్ల బలాబలాలు నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తూ ప్రజల్లో తమ ఉనికిని చాటుకునేందుకు పలు రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ సాధించింది మేమే అని చెప్పుకునే అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని అధినేత కానీ పలు సభలు,సమావేశాలు అంటూ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల పేరిట సభలు నిర్వహిస్తూ ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామంటూ ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన జండ
ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికలకు నేడు జరగబోయే ఎన్నికల్లో పార్టీ పేరు మారింది కానీ పార్టీ జెండా మారలేదు,పార్టీ ఎజెండా మారింది కానీ ఆ ఎజెండా పార్టీలోని కిందిస్థాయి కార్యకర్తలకు గాని నాయకులకు గాని అభిమానులకు గాని అందకపోవడం కడు విడ్డూరంగా ఉంది.గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కేసిఆర్ ఇక రాష్ట్రంలో జరిగిన అభివృద్ది చాలు అన్నట్టు ఇంతకాలం రాష్ట్రం కోసం కొట్లాడినం ఇక ఇప్పుడు
భారతదేశం కోసం కొట్లాడుతాం అని టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్పు చేసిన కేసీఆర్ ఈ ప్రజా ఆశీర్వాద సభలో కూడా జై తెలంగాణ అని అంటున్నారు కానీ తన నినాదాల్లో జై బిఆర్ఎస్ అనడం లేదు.చివరికి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తాను వేసుకున్న పార్టీ కండువాపై బిఆర్ఎస్,భారత రాష్ట్ర సమితి అని పెద్ద పెద్ద అక్షరాలు కనబడడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర సాధన నుండి భారత రాష్ట్ర సమితి గా మారిన జండ
ఇక్కడ ఈ అంశం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే ఆ కార్యక్రమాలకు,సభలకు వెళ్లే ప్రజలు,కార్యకర్తలు,పార్టీ నాయకులు,అభిమానంతో వెళ్తున్నామని చెప్పుకునే సాధారణ పౌరులు సైతం తమ చేతిలో ఏ జెండా ఉందో కూడా ఆ జెండాకు జై కొట్టాలనే విషయం కూడా మర్చిపోయి జై బిఆర్ఎస్ అనాల్సింది పోయి జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారు.ఎత్తిన జెండా యొక్క నినాదాలు ఎత్తిన జెండా యొక్క ఎజెండా ఏమిటో మర్చిపోయి వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలో నెలకొంది.ఇటువంటి పరిస్థితుల్లో వీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు……? ఏ విధంగా ఓట్లు సంపాదిస్తారని చర్చ కూడా జరుగుతున్న వైనం రాష్ట్రంలో నెలకొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంటుతో ఎన్నికల్లో గెలిచి తర్వాత బయట నినాదాలు చేసే ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని ప్రస్తుతం జై బిఆర్ఎస్ నినాదాలు చేస్తే తెలంగాణ ప్రజల్లో ఉన్న తెలంగాణ వాదం సెంటిమెంటు బలహీనమవుతుందని గ్రహించి సెంటిమెంటుతో ఓట్లు సంపాదించుకునే దిశగా ఇలా వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్న వైనం కూడా నెలకొంది.ఇక బిఆర్ఎస్ అధినేత అన్నట్టుగా ఒక్క మాటకు వంద అర్థాలు తీయాలి,ఒక్క మాటను వంద రకాలుగా అర్థం చేసుకోవాలి అని అన్నట్టుగా వీరి ప్రవర్తనను ప్రజలు పలు రకాలుగా అర్థం చేసుకొని ఆలోచించి ఓటు వేద్దామని కూడా చర్చించుకుంటున్న వైనం రాష్ట్రంలో నెలకొంది.
వ్యాసకర్త:
సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు సిద్దిపేట
జర్నలిస్ట్ 9985021041.