మే నెల 1,2 వ తేదీలలో పి.ఓ లు, ఎ.పి.ఓలకు, మే 3వ తేదీన ఓ.పి.ఓ లకు శిక్షణా తరగతులు: జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా.

జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:

లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ విధులు కేటాయించిన పిఓ, ఎపిఓలు మరియు ఓపివోలకు మే 1, 2 మరియు 3వ తేదీల్లో రెండవ విడత శిక్షణా తరగతులు నిర్వహించనునట్లు జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తెలిపారు. 2వ విడత ర్యాన్డ మైజేషన్ ప్రక్రియ నిర్వహణ తదుపరి పీఓ, ఏపీఓ లకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మే 1, 2 తేదీల్లో పిఓలు, ఏపీఓలకు, 3వ తేదీన ఓపిఓలకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. విధులు కేటాయించిన పిఓలు, ఏపీఓలు ఉదయం 9 గంటలకు భూపాలపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాంటిసోరి ఉన్నత పాఠశాలలో రిపోర్టు చేయాలని ఆయన తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా తప్పని సరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలని, ఎలాంటి మినహాయింపులేదని ఆయన పేర్కొన్నారు. గైర్హాజరైన సిబ్బంది పై ఎన్నికల సంగం నిబంధనలు మేరకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 397 మంది పీఓలు, 425 మంది ఎపిఓలు, అలాగే 789 ఓపిఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని స్టాఫ్ మేనేజ్మెంట్ అధికారులను ఆయన ఆదేశించారు.

You may also like...

Translate »