ఈనెల 11న వికారాబాద్ కు అమిత్ షా

ఈనెల 11న వికారాబాద్ కు అమిత్ షా
జ్ఞాన.తెలంగాణ న్యూస్ వికారాబాద్ జిల్లా నవాబూ పేట మండల .వికారాబాద్, మే 06 (జ్ఞాన తెలంగాణ న్యూస్): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఈ నెల 11వ తేది శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నట్లు స్థానిక బిజెపి శ్రేణులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా నిర్వహించనున్న ప్రచార సభ లో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొననున్నారు. 400 సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ దేశం నలుమూలల పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ పెద్దలు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు. సభ నిర్వహణకు బిజెపి శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ మీటింగ్ కు చేవెళ్ల పార్లమెంట్ నలుమూలల నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.