కొడిమ్యాల తెలంగాణ మోడల్ స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు

కొడిమ్యాల తెలంగాణ మోడల్ స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు


జ్ఞానతెలంగాణ,కొడిమ్యాల:
భారతీయ గణిత శాస్త్రవేత్త ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ మాడల్ స్కూల్ మరియు కళాశాలలో శ్రీనివాస రామానుజన్ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ బి లావణ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీనివాస రామానుజన్ మేధస్సును సమస్యలు పరిష్కరించడంలో వేగాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని జీవితంలో ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని ప్రిన్సిపల్ కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. విద్యార్థినిలు గణిత సమస్యలతో కూడిన రంగవల్లి లు వేయడం అందరిని అలరించింది. విద్యార్థులు గణిత సమస్యలు పరిష్కరములతో కూడిన ప్రాజెక్టులను ప్రదర్శించారు.రామానుజన్ సంఖ్య 1729 ఆకృతిలో విద్యార్థులు కూర్చుని ఉండటం ఆకట్టుకున్నది. సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాద్యాయులు ప్రమోద, శరణ్య, నిషాని మహేందర్, రాజేశం, అనూప్ & స్టాఫ్ పాల్గొన్నారు.

You may also like...

Translate »