చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
పరిషత్ అధ్యక్షురాలు సునీత అంధ్య నాయక్
ప్రత్యేక అతిథిగా జిల్లా విద్యాధికారి సుసీందర్ రావు
మహేశ్వరం ఎంపీడీవో శైలజా రెడ్డి
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) మహేశ్వరం ఆవరణలో మండల విద్యాధికారి ఆధర్ల కృష్ణయ్య అధ్యక్షతన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షురాలు సునీత అంధ్య నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యార్హతలు సుశిక్షితులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తారని తెలియజేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రత్యేక అతిథిగా జిల్లా విద్యాధికారి సుసీందర్ రావు హాజరై, ప్రతిరోజు తల్లిదండ్రులు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే, తమ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోగలుగుతారని తద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఆ విషయాన్ని తెలియజేయడం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్య అందించబడుతుందని తెలియజేశారు.అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలో చేర్పించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దని,తమ పిల్లల మీద కొంత శ్రద్ధ చూపిస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టించగలరని తెలియజేశారు.అనంతరం అధికారులు ఉపాధ్యాయులు చిన్నారులకు పలకలపై అక్షరాలు రాయించి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి శైలజా రెడ్డి,మండల నోడల్ ఆఫీసర్ కస్నా నాయక్,మహేశ్వరం గ్రామ ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్ యాదవ్, శ్రవణ్ , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, రాములు, యాదయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు వీరమల్లేష్, జానకిరామ్,ఆనంద్ కుమార్,అంగన్వాడి కార్యకర్తలు,తల్లిదండ్రులు మరియు చిన్నారులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
