పెట్టుబడి దారి విధానం పేదరికం, ఆకలిని పెంచుతుంది మతం మూడోత్వంలోకి నెట్టుతుంది:

పెట్టుబడి దారి విధానం పేదరికం, ఆకలిని పెంచుతుంది మతం మూడోత్వంలోకి నెట్టుతుంది:
ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ మే 16:
నేడు పెట్టుబడిదారి విధానం ప్రజలను రోజురోజుకు పేదరికంలోకి, నెట్టుతున్నది ప్రజల ఆకలిని తీర్చలేక పోతున్నది. మతం మనిషిని ప్రశ్నించే తత్వం నుండి మూఢత్వంలోకి నెట్టి ప్రశ్నించే గుణాన్ని కోల్పోయేలా చేస్తుందని ఈ రెండిటిని ప్రజలు కూలదోయాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.హన్మేస్ అన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్, భగత్ సింగ్ భవన్ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన పార్టీ జిల్లా రాజకీయ శిక్షణా తరగతులకు రెండవ రోజు సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ డివిజన్ కార్యదర్శ కె.కాశీనాథ్ అధ్యక్షత వహించగా సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.హన్మేస్ రెండవ రోజు జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై క్లాస్ బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాలు తమ మార్కెట్ ల కోసం కొట్లాడుతున్నాయి. ఒకనాడు ద్వదృవ ప్రపంచాలుగా అమెరికా దేశం పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటూ పెత్తనం చలయించింది. సోవియల్ రష్యా వెనుకబడిన దేశాలవైపు నిలబడింది. అనంతరం సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిన తర్వాత అమెరికా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ప్రపంచ సంపదను కొల్లగొట్టింది, ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా దేశాలు పోటీ పడుతున్నాయి. ఉక్రెయిన్ దేశం మా వైపు ఉండాలంటే మా వైపు ఉండాలంటూ రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది. అమెరికా రష్యా కు వ్యతిరేంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు అమ్ముతున్నది. ఈ యుద్ధంలో ఉక్రెన్ పౌరులు 35 వేల మంది చనిపోయారు. ఈ విషయాలు కార్పొరేటు, పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు అనుకూలమైనవి తప్పితే పేదరికాన్ని,ఆకలిని రూపుమాపేందుకు కావు అన్నారు . మనం కార్పొరేటు పెట్టుబడి దారి విధానానికై సామ్రాజ్యవాదానికి, యుద్ధాలకు వ్యతిరేకంగా, కొట్లాడాలన్నారు. మన దేశంలో నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని దేశభక్తి. దేవుడు , మతంతో ముడిపెట్టి పాలన కొనసాగిస్తున్నాడు. దేశ సంపదను ,ప్రభుత్వ సంస్థలను ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెట్టుబడిదారులకు అప్ప చెప్తున్నాడు. టెలికం, ఏర్ లైన్, ఇన్సూరెన్స్, ఫుడ్ కార్పొరేషన్, ఇలాంటి వాటిని తక్కువ రేటుకు అమ్మేశాడు ఆదానికి అప్పజెప్పిండు. వీటితోపాటు పెట్టుబడుదారులకు 10 లక్షల కోట్ల పన్ను రాయితీ ఇచ్చిండు, 16 లక్షల కోట్లు రుణాలు రద్దు చేశాడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారత్ ప్రపంచ ఆకలి సంచులో 94 స్థానానికి ఎగపాకింది. కరోనా సమయంలో పెట్టుబడిదారుల సంపద 40 % పెరిగింది. 20 లక్షల మంది కార్మికులు పనీ కోల్పోయారు. 66 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇవన్నీ ప్రశ్నించిన వారిని దేశద్రోహులంటూ జైల్లో వేస్తున్నారు. హిందూ మత వ్యతిరేకులు పాకిస్తాన్, చైనా అనుకూలూరు, అంటూ ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ మతం పేరు మీద అరాచకాలు సృష్టిస్తున్నారు. విద్య రంగంలోకి కాషాయీకరణను చొప్పించి ప్రశ్నించే తత్వం కోల్పోయేలా విద్యార్థులను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యా రంగంలోకి చొరబడ్డారు. అసలైన దేశద్రోహులు మోడి పరివారమే అన్నాను. సమస్యలను పక్కదారి పట్టించడం కోసం శ్రీరాముని పేరు మీద పరిపాలన కొనసాగిస్తున్నారు తప్పితే మరొకటి కాదు. కావున ఇట్టి విషయాలు ప్రజలకు బోధించాల్సిన బాధ్యత మనలాంటి ప్రగతిశీల శక్తులపై ఉందని అందుకోసం తీవ్రమైన కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. జర్మనీ నియంత హిట్లర్ను మట్టికర్పించిన చరిత్ర ప్రజలది దానితో పోలిస్తే నేటి మోడీ ఎంత అని అన్నారు. కాబట్టి మోడీకి ఆయన పెంచి పోషిస్తున్న మూఢవిశ్వాసాలను, కార్పొరేట్ శక్తులను మట్టి కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము, జిల్లా నాయకులు సలీం, జయలక్ష్మి ,బోయిన్పల్లి రాము, కిరణ్ కాలేశ్వర్ యాదగిరి తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.