మన్నె శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి

మన్నె శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి:
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 7:దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామములో పార్టీ కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో బాగంగా ఇంటింటా ప్రచారంలో కొనసాగించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై టిఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు.మళ్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం మన కుటుంబాలకు అండగా ఉంటూ పేద రైతులను చైతన్యవంతంతో అనేక సంక్షేమ పథకాలను ఇస్తున్న మన ఇంటి ప్రభుత్వాన్ని మళ్లీ మనం తిరిగి పొందే అవకాశం వచ్చిందని గ్రామస్తులకు ఇంటింటి ప్రచారాన్ని చేస్తూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై నిరుద్యోగం పేదరికం ఆర్థిక అభివృద్ధి జరిగేలా బిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది.గ్రామాల అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.