భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మాసారపు రామకృష్ణ ఆధ్వర్యంలో మండలం మహాసభ


జ్ఞాన తెలంగాణ నల్లగొండ త్రిపురారం ప్రతినిధి:-
త్రిపురారం మండల కేంద్రంలోని భవన కార్మిక నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు ను త్రిపురారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది..ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఎవరైతే భవననిర్మాణ పనులు చేస్తారో వారు లేబర్ కార్డ్ లు మరియు సభ్యత్వం తీసుకోవాలి అన్నారు .. అంతే కాకుండా కార్డుల పరిమితి ముగిసిన వారు కార్డులను రెనివల్ చేసుకోవాలన్నారు… అలా చేసుకోవడం వలన కార్మికుల కుటుంబాలకి ఎంతో ఉపయోగకరం అన్నారు.. అదేవిధంగా ఈ నెల 20/09/2025 న జరిగే జిల్లా సమీక్ష సమావేశానికి మండలం నుండి 8 మంది చొప్పున హాజరుపర్చాలనీ మండల అధ్యక్షులకు సూచించడం జరిగింది….. ఈ కార్యక్రమంలో నగిరి వెంకన్న బైరo శ్రీను చింతకుంట్ల సురేష్ క్యామ గిరి అనుముల అంజయ్య హాలియా సైదులు డాలు రామకృష్ణ అన్నేపాక శ్రీను షేక్ బాబు షేక్ రహీం ,మండల భవన నిర్మాణ కార్మికులు మరియు తదితరులు పాల్గొన్నారు…

You may also like...

Translate »